సముద్రంలో రెండు నౌకలు ఢీ.. 32 మంది గల్లంతు
- ప్రమాదంతో తగలబడిన నౌక
- చమురు ఒలికిపోయి సముద్ర జలాలు కలుషితం
- 9 నౌకలు, విమానం ద్వారా గాలింపు చర్యలు
ఈ ఘటనలో మొత్తం 32 మంది సిబ్బంది గల్లంతవగా 21 మందిని సహాయక బృందాలు రక్షించాయి. ట్యాంకర్‌కు మంటలు అంటుకోవడంతో చమురు మొత్తం సముద్ర జలాల్లో కలిసి పోయింది. ఫలితంగా జలాలు కలుషితమైనట్టు చైనా రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు ఇంకా గాలిస్తూనే ఉన్నాయి. మొత్తం 8 నౌకలు గాలింపు చర్యలు చేపట్టాయి. మరోవైపు దక్షిణ కొరియా ఓ విమానం, ఓ నౌక ద్వారా గాలింపు చర్యలు చేపట్టింది.