ఒంగోలులో బాలుడిని కిడ్నాప్ చేసి రూ. 70 లక్షలు అడిగిన దుండగులు... ఆరు గంటల్లోనే పట్టేసిన పోలీసులు!
- రాత్రి 10 గంటల సమయంలో కిడ్నాప్
- రూ. 70 లక్షలు ఇస్తేనే వదిలేస్తామని బెదిరింపు
- తెల్లవారుజామున 4 గంటలకు అరెస్ట్
దీంతో దుండగుల సెల్ ఫోన్ నంబరును ట్రాకింగ్ లో పెట్టి రాత్రంతా గాలించారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో గుంటూరు సమీపంలో కిడ్నాపర్ల జాడను తెలుసుకున్నారు. బాలుడిని అపహరించిన వారిలో ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు, మరికొందరి కోసం గాలిస్తున్నామని చెప్పారు. బాలుడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించినట్టు తెలిపారు.