జూబ్లీ హిల్స్ లో నడిరోడ్డుపై బైకర్ ను అడ్డగించి.. దోపిడీ!
- అందరూ చూస్తుండగానే దారిదోపిడీ
- కత్తితో బెదిరించి బైకు, పర్సు, రెండు సెల్ఫోన్లను కాజేసిన దుండగులు
- సీసీ కెమెరాల ఆధారంగా పోలీసుల దర్యాప్తు
దుండగులు కత్తితో బెదిరిస్తూ ఈ దోపిడీకి పాల్పడ్డారు. రోడ్డుపై వెళుతోన్న ఇతర వాహనదారులు చూస్తూ నిలబడ్డారే కానీ, ఎవ్వరూ అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాకు చిక్కాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.