Agnatawasi: 'అజ్ఞాత‌వాసి'నా సినిమా కాపీయేమో చూసేందుకు టికెట్ కొంటా: 'లార్గో వించ్' దర్శకుడు

షార్ట్స్‌లో చూడండి
మరో వారంలో విడుదల కానున్న పవన్ కల్యాణ్ 'అజ్ఞాతవాసి' చిత్రం ఫ్రెంచ్ చిత్రం 'లార్గోవించ్'కి రీమేక్ అని వార్తలు వస్తున్న వేళ, ఆ చిత్ర దర్శకుడు జెరోమ్ సాల్లీ స్పందించారు. "నేను ఆ సినిమాకు ఓ టికెట్ కొనుక్కోవాలని అనుకుంటున్నాను (అంతకన్నా ముందు విమానం టికెట్)" అని జెరోమ్ ట్వీట్ చేశారు. ఇక లార్గో వించ్ రీమేక్ హక్కులను కలిగివున్న టీ-సిరీస్, 'అజ్ఞాతవాసి' నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపినట్టు పత్రికల కథనాల్లో చూసి తెలుసుకున్న జెరోమ్, ఈ మేరకు ట్వీట్ చేశారు. 'అజ్ఞాతవాసి' సినిమా టీజర్ విడుదలైనప్పటి నుంచి అది 'లార్గో వించ్' రీమేక్ అని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Agnatawasi
Largo Winch
Pawan Kalyan
Jérôme Salle

More Telugu News