పవన్ కల్యాణ్ మనోడు.. బాగా చూసుకోండి: కేసీఆర్
Add ap7am to your home Screen

పవన్ కల్యాణ్ మనోడు.. బాగా చూసుకోండి: కేసీఆర్

  • పవన్ ను బాగా చూసుకోండి
  • నేతలు, కార్యకర్తలకు కేసీఆర్ సూచన
  • చర్చనీయాంశమైన కేసీఆర్ వ్యాఖ్యలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. వపన్ కల్యాణ్ మన వ్యక్తే అని.. ఇకపై పవన్ ను బాగా చూసుకోండని టీఆర్ఎస్ శ్రేణులకు, కార్యకర్తలకు ఆయన సూచించారు. నిన్న ప్రగతి భవన్ కు వెళ్లిన పవన్ కల్యాణ్... కేసీఆర్ తో దాదాపు రెండు గంటల సేపు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ ను డిన్నర్ చేయాలని కేసీఆర్ కోరినప్పటికీ, పవన్ వద్దన్నారు. భేటీ సమయంలో రాజకీయ అంశాలు, సమస్యలపై వీరిద్దరూ చర్చించారు. మరోవైపు, పవన్ ను బాగా చూసుకోవాలన్న కేసీఆర్ వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పార్టీలకు అతీతంగా నేతలంతా దీనిపై చర్చించుకుంటున్నారు.
KCR
Pawan Kalyan
kcr comments on pawan

More Telugu News