రేపు ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
- రాష్ట్ర ఎంపీలతో కలిసి ఉపరాష్ట్రపతిని కలవనున్న ఇంద్రకరణ్ రెడ్డి
- మేడారం జాతర, గిరిజన కుంభమేళాలకు జాతీయ పండగ గుర్తింపు కావాలి
- కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రితో కూడా భేటీ
ఈ సందర్భంగా ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ, గిరిజన కుంభమేళాగా పిలిచే మేడారం జాతరను జాతీయ పండగగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని చెప్పారు. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరని, ఈ జాతరకు మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో ప్రజలు హాజరవుతారని తెలిపారు.