Hyderabad: రేపటి నుంచి హైదరాబాద్‌లో ఉపవాసదీక్షలు.. మాతో పెట్టుకుంటారా?: మంద కృష్ణ మాదిగ

షార్ట్స్‌లో చూడండి
ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని ఎమ్మార్పీఎస్ అధ్య‌క్షుడు మంద‌ కృష్ణ మాదిగ అన్నారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో పాటు ఉప ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీహ‌రికి కూడా ద‌ళితులు గుణ‌పాఠం చెబుతారని అన్నారు. రేపటి నుంచి హైదరాబాద్‌లో ఉపవాసదీక్షలు ప్రారంభిస్తున్నామ‌ని, ఎమ్మార్పీఎస్‌తో పెట్టుకుంటే కేసీఆర్ అయినా, ఎవరైనా ఓడిపోక తప్పదని అన్నారు. కేసీఆర్ దళితులని వంచించడంలో ఉప ముఖ్య‌మంత్రి కడియం శ్రీహరి పాత్ర కూడా ఉందని ఆరోపించారు. హైదరాబాద్‌లో తమకు ఎక్కడ అనుమతి ఇచ్చినా శాంతియుతంగా దీక్ష చేస్తామ‌ని తెలిపారు.        
Go Back to Shorts
Hyderabad
manda krishna madiga
strike

More Telugu News