conistable: పరస్పరం చెంపలు ఛెళ్లుమనిపించుకున్న మహిళా ఎమ్మెల్యే, కానిస్టేబుల్!
హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహించారు. కాగా, ఈ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకురాలు ఆశా కుమారి ఓ మహిళా కానిస్టేబుల్‌పై చేయి చేసుకోవడం అలజడి రేపింది.
ఆ సభకు వెళ్లడానికి మిగతా ఎవ్వరినీ అనుమతించవద్దని ఆదేశాలు ఉండడంతో ఓ మహిళా కానిస్టేబుల్ సదరు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే సదరు కానిస్టేబుల్ చెంపఛెళ్లుమనిపించగా, ఆ కానిస్టేబుల్ కూడా ఎమ్మెల్యేను తిరిగి కొట్టారు. దీంతో అక్కడ కాసేపు గందరగోళం నెలకొంది. ఈ దృశ్యం మీడియాకు చిక్కింది.