ఇక నుంచి టిమ్ కుక్ ప్రయాణం ప్రైవేట్ జెట్‌లోనే!
- అంగీకారం తెలిపిన ఆపిల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు
- వ్యక్తిగత పనులకు కూడా
- భద్రతా కారణాల దృష్ట్యా నిర్ణయం
2017లో టిమ్ కుక్ 12.8 మిలియన్ డాలర్లు సంపాదించారు. ఇందులో 3.06 మిలియన్ డాలర్లు వేతనంగా పొందగా, 9.3 మిలియన్ డాలర్లు బోనస్‌గా పొందినట్లు టెలిగ్రాఫ్ పత్రిక ప్రచురించింది. 2017లో ఆయన వ్యక్తిగత ప్రయాణ ఖర్చుగా ఆపిల్ 93,109 డాలర్లు ఖర్చు చేసినట్లు సమాచారం. కేవలం టిమ్ కుక్ కోసం ప్రత్యేకంగా పర్సనల్ సెక్యూరిటీ సర్వీసెస్‌ను ఆపిల్ నియమించింది.