ప్రియుడు అత్యాచారం చేస్తుంటే కేకలు పెట్టిన యువతి.. సహాయం చేస్తామని వచ్చి మరో ముగ్గురు కూడా అదే పని!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రియుడు అత్యాచారం చేస్తుంటే కేకలు పెట్టిన యువతి.. సహాయం చేస్తామని వచ్చి మరో ముగ్గురు కూడా అదే పని!

  • హోటల్ లో పని చేస్తున్న 24 ఏళ్ల యువతి
  • స్నేహితుడితో కలసి బయటకు వెళితే అత్యాచారం
  • కేకలు పెడుతుంటే, వచ్చి స్నేహితుడిని తరిమి గ్యాంగ్ రేప్
  • పోలీసుల అదుపులో నలుగురు
సభ్య సమాజం తలదించుకోవాల్సిన ఘటన ఇది. ఆపదలో ఉన్న యువతి, ఆదుకోవాలని కేకలు పెడుతుంటే, అక్కడికి వచ్చిన వారు, ఆమె నిస్సహాయతను తమలోని కామవాంఛలు తీర్చుకునేందుకు ఉపయోగించుకున్నారు. మానవత్వాన్ని మంటగలిపిన ఈ ఘటన చండీగఢ్ లో కలకలం రేపగా, పోలీసులు నలుగురు కామాంధులను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు పంపారు.

మరిన్ని వివరాల్లోకి వెళితే, రాయ్ పూర్ లోని 24 సంవత్సరాల మహిళ, భర్తను కోల్పోయి ఓ హోటల్ లో పని చేస్తూ, సురేష్ సాహు అనే యువకుడితో స్నేహంగా ఉంటోంది. ఈ క్రమంలో సురేష్ ఆమెను కప్పా సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. తనను రక్షించాలని బాధితురాలు కేకలు పెడుతుంటే, అదే దారిలో వెళుతున్న హరీష్ చంద్రకార్, త్రినాథ్ మహానంద్, వినయ్ యాదవ్ లకు అవి వినపడ్డాయి.

దీంతో వారు పరుగున అక్కడికి వచ్చారు. వచ్చీ రావడంతోనే కొడతామంటూ సురేష్ ను బెదిరించారు. దీంతో సురేష్ అక్కడి నుంచి పారిపోగా, ముగ్గురూ కలసి ఆమెను గ్యాంగ్ రేప్ చేశారు. ఆపై ఆమెను వదిలేసి వెళ్లిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Chandighar
Gang Rape
Raipur

More Telugu News