బాయ్‌ఫ్రెండ్‌తో క్రిస్‌మస్ వేడుక జరుపుకున్న నయనతార
- ఫొటోలు షేర్ చేసిన విఘ్నేశ్ శివన్
- ప్రియురాలిని పొగడ్తలతో ముంచెత్తిన దర్శకుడు
- ఆకట్టుకుంటున్న ఫొటో
వీరిద్దరూ కలిసి క్రిస్‌మస్ వేడుకలు జరుపుకున్న ఫొటోలను విఘ్నేశ్ షేర్ చేశాడు. ఆ ఫొటోలతో పాటు చేసిన పోస్టులో నయన్‌ని పొగడ్తలతో ముంచెత్తాడు. నయనతార ఇండస్ట్రీకి వచ్చి 14 ఏళ్లు గడిచిన విషయాన్ని విఘ్నేశ్ గుర్తుచేశాడు. నయనతార మొదటి చిత్రం మనసినక్కరే క్రిస్‌మస్ రోజునే విడుదలైందని, తామిద్దరం ఆనందంగా అదే క్రిస్‌మస్ వేడుకను జరుపుకున్నామని తెలిపాడు. ఆయన షేర్ చేసిన ఫొటోల్లో అందంగా అలంకరించిన క్రిస్‌మస్ ట్రీ, ఆ పక్కనే వారి జంటను చూడొచ్చు.