మల‌యాళ నటుడు పహధ్ ఫాసిల్ అరెస్ట్.. బెయిల్‌!

  • పుదుచ్చేరిలో రూ.20 లక్షల విలువైన లగ్జరీ కారును కొన్న న‌టుడు
  • 20 శాతం ప‌న్నుని ఎగ్గొట్టేందుకు ప్ర‌య‌త్నాలు
  • నకిలీ డాక్యుమెంట్స్‌తో వాహనం రిజిస్ట్రేషన్
ఓ వాహ‌నం కొనుగోలు చేసిన మల‌యాళ నటుడు పహధ్ ఫాసిల్ దానిపై కట్టాల్సిన 20 శాతం పన్నును ఎగ్గొట్టేందుకు న‌కిలీ డాక్యుమెంట్స్ ఉపయోగించడంతో పోలీసులు ఆయ‌న‌ను అరెస్టు చేశారు. ఆయ‌న‌ నకిలీ డాక్యుమెంట్స్‌తో వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేశాడ‌ని, ఈ రోజు అరెస్టు చేసి బెయిల్‌పై విడుద‌ల చేశామ‌ని పోలీసులు తెలిపారు. ఇందుకోసం రూ.50 వేల పూచీకత్తు, ఇద్దరు వ్యక్తుల నుంచి షూరిటీ తీసుకున్న‌ట్లు వివ‌రించారు. కాగా, గ‌తంలో పుదుచ్చేరిలో పహధ్ రూ.20 లక్షల విలువైన లగ్జరీ కారును కొన్నాడు. 
Go Back to Shorts
malayalam
actor pahad
arrest

More Telugu News