ప్రొ రెజ్లింగ్ లీగ్ మూడో సీజన్ ప్రత్యేక కార్యక్రమంలో సందడి చేసిన రెజ్లర్లు
- డ్యాన్సులు, ర్యాంప్ వాక్‌లు చేసిన క్రీడాకారులు
- స్టెప్పులు వేసి ఆకట్టుకున్న గీతా ఫొగట్
- జనవరి 9 నుంచి ప్రారంభంకానున్న ప్రొ రెజ్లింగ్
ముఖ్యంగా 'దంగల్' సినిమాలోని ఓ పాటకు గీతా ఫొగట్, రీతూ ఫొగట్ చేసిన డ్యాన్స్ అందరినీ ఆకర్షించింది. బాలీవుడ్‌లో క్రీడల నేపథ్యంలో వచ్చిన సినిమాల్లోని పాటలకు ఇతర రెజ్లర్లు స్టెప్పులు వేశారు. అంతేకాకుండా ప్రత్యేక దుస్తులు ధరించి ర్యాంప్ మీద నడిచారు. జనవరి 9నుంచి పీడబ్ల్యూఎల్-3వ సీజన్ ప్రారంభంకానుంది. రెజ్లింగ్ క్రీడకు మంచి ప్రాచుర్యం కల్పించడానికి ప్రొ రెజ్లింగ్ లీగ్ గొప్ప ప్లాట్‌ఫాం అని క్రీడాకారులు అన్నారు.