Andhra Pradesh: కోడిపందేలకు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్నల్... ప్ర‌క‌టించిన ఏపీ హోంమంత్రి

షార్ట్స్‌లో చూడండి
కోట్ల‌లో బెట్టింగ్ జ‌రిగే కోడి పందేల‌కు అనుమ‌తినిస్తున్న‌ట్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ హోంమంత్రి నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప తెలియ‌జేశారు. సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా మూడు రోజుల పాటు పందేలు నిర్వ‌హించుకోవ‌చ్చున‌ని ఆయ‌న చెప్పారు. ఒక ప‌క్క చ‌ట్టాల‌ను గౌర‌విస్తూనే, మ‌రో ప‌క్క అనాదిగా వ‌స్తున్న సంస్కృతి, సంప్ర‌దాయాల‌ను కూడా కాపాడుకోవాల్సిన బాధ్య‌త అందరిపై ఉంద‌ని ఆయ‌న అన్నారు. తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌మ‌హేంద్ర‌వ‌రం గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య‌చౌద‌రిని ఆయ‌న ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
china rajappa

More Telugu News