తెలుగు భాషలో వాదనలు.. హైకోర్టులో అరుదైన ఘటన!
- అనుమతించిన న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖర్ రెడ్డి
- వాదించిన న్యాయవాది సోమరాజు
- భూ సేకరణ వివాదం కేసుకు సంబంధించి విచారణ
భూ సేకరణ వివాదం కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహాయ న్యాయవాది సోమరాజు తెలుగులో వాదనలు వినిపించి ఆకట్టుకున్నారు. వాదనలు పూర్తయ్యాక న్యాయమూర్తి తీర్పు వెలువరించి సమస్యను పరిష్కరించారు. తెలుగులో వాదనలు వినిపించిన న్యాయవాది సోమరాజును పలువురు న్యాయవాదులు అభినందించారు.