సోనియా ఇంటికి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్లు

  • ఫలితాల సరళిపై కొనసాగనున్న చర్చ
  • కాసేపట్లో మీడియాతో మాట్లాడనున్న రాహుల్
  • మోదీతో భేటీ అయిన సీనియర్ నేతలు
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కొద్దిసేపటి క్రితం 10 జన్ పథ్ కు చేరుకున్నారు. తన తల్లి సోనియా గాంధీతో ఫలితాల సరళిపై చర్చించేందుకు ఆయన వచ్చారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాహుల్ తో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్లు సైతం సోనియా ఇంటికి చేరుకున్నారు. మరికాసేపట్లో రాహుల్ మీడియాతో మాట్లాడతారని సమాచారం.

కాగా, మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీతో అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్, అమిత్ షాలు భేటీ అయ్యారు. పార్లమెంట్ లోని బీజేపీ కార్యాలయంలో వీరి సమావేశం జరిగింది. రెండు రాష్ట్రాల్లో ఫలితాలు తమకు అనుకూలంగా రావడం పట్ల బీజేపీ నేతలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ విజయాలను తాము ముందే ఊహించామని వ్యాఖ్యానించిన రాజ్ నాథ్ సింగ్, రెండు రాష్ట్రాల్లో వచ్చేది తమ ప్రభుత్వమేనని అన్నారు.
Go Back to Shorts
10 Janpath
Sonia gandhi
Rahul Gandhi
BJP
Congress

More Telugu News