'హలో' శాటిలైట్ రైట్స్ షాకిస్తున్నాయ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'హలో' శాటిలైట్ రైట్స్ షాకిస్తున్నాయ్

  • అఖిల్ రెండవ సినిమాగా 'హలో'
  • శాటిలైట్ రైట్స్ కి గట్టిపోటీ 
  • 5 కోట్ల 90 లక్షలకు దక్కించుకున్న జీ తెలుగు 
  • ఈ నెల 22వ తేదీన భారీస్థాయిలో విడుదల
అఖిల్ రెండవ సినిమాగా 'హలో' ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఈ నెల 22వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్ .. టీజర్ .. ఆడియో అభిమానుల్లో అంతకంతకూ ఆసక్తిని పెంచుతూ వెళ్లాయి. దాంతో ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కి గట్టిపోటీ ఏర్పడింది. చివరికి జీ తెలుగు ఛానల్ వారు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను సొంతం చేసుకున్నారు.

 ఇందుకోసం వాళ్లు 5 కోట్ల 90 లక్షలను చెల్లించినట్టు సమాచారం. మొదటి సినిమా ప్లాప్ అయినా .. రెండవ సినిమాకి ఈ స్థాయి రేటు పలకడం విశేషం. గతంలో 'అఖిల్' సినిమా శాటిలైట్స్ రైట్స్ ను సొంతం చేసుకున్నది కూడా ఈ ఛానల్ వారే. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ 29 కోట్ల వరకూ జరిగినట్టుగా సమాచారం. బ్రేక్ ఈవెన్ లోకి రావాలంటే ఖర్చులన్నీ కలుపుకుని 33 కోట్లు రావాలి. తెలుగు రాష్ట్రాల్లోనే ఇంత మొత్తం సాధించడం కష్టం కనుక, ఓవర్సీస్ పై దృష్టి పెట్టినట్టుగా చెప్పుకుంటున్నారు.  
akhil
kalyani priyadarshan

More Telugu News