బైక్ బోల్తా.. లాక్ ప‌డిన హెల్మెట్.. యువ‌కుడి మృతి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బైక్ బోల్తా.. లాక్ ప‌డిన హెల్మెట్.. యువ‌కుడి మృతి!

  • రూ.50,000 ఖ‌ర్చు చేసి హెల్మెట్ కొనుక్కున్న బైక‌ర్‌
  • వేగంగా బైకుపై వెళుతూ కింద‌ప‌డిపోయిన యువ‌కుడు
  • హెల్మెట్‌ లాక్‌ అవడంతో బ్రెయిన్‌ స్ట్రోక్‌
ముచ్చ‌ట‌ప‌డి రూ.50,000 ఖ‌ర్చు చేసి హెల్మెట్ కొనుక్కున్నాడు ఓ యువ‌కుడు. కానీ, చివ‌ర‌కు ఆ హెల్మెట్టే అత‌డి ప్రాణాలు తీసింది. రాజస్థాన్‌కి చెందిన ఓ బైకర్ వేగంగా బైక్ న‌డుపుతూ వెళుతోన్న స‌మ‌యంలో అది ఒక్క‌సారిగా స్లిప్ అయింది. త‌ల‌కి హెల్మెట్ ఉండడంతో మొద‌ట ఎటువంటి హానీ జ‌ర‌గ‌లేదు.

రోడ్డుపై ప‌డి ఉన్న అత‌డి వ‌ద్ద‌కు వెంట‌నే వ‌చ్చిన పోలీసులు స్థానిక ఆసుప‌త్రికి త‌ర‌లించాల‌నుకున్నారు. అతడి త‌ల‌కు ఉన్న హెల్మెట్‌ను తీయ‌డానికి ప్ర‌య‌త్నించారు. అయితే, ఆ హెల్మెట్ ఎంత‌కూ రాలేదు. ఆ హెల్మెట్‌ లాక్‌ అయిందని చివ‌రికి పోలీసుల‌కు తెలిసింది. దీంతో హెల్మెట్‌లోనే అత‌డి త‌ల ఇరుక్కుపోవ‌డంతో బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురై ఆ యువ‌కుడు మృతి చెందాడు. 
helmet
bike
biker died

More Telugu News