stock market: స్టాక్ మార్కెట్లకు గుజరాత్ ఎగ్జిట్ పోల్స్ కిక్కు... 300 పాయింట్ల లాభంలో సెన్సెక్స్

షార్ట్స్‌లో చూడండి
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగిస్తుందంటూ దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ ముక్త కంఠంతో చెప్పడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల దిశగా కొనసాగుతున్నాయి. నిన్న గుజరాత్ తుదిదశ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడిన విషయం తెలిసిందే. బీజేపీ విజయ సంకేతాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 315 పాయింట్ల లాభంతో 33,562 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 98 పాయింట్ల లాభంతో 10,350 వద్ద ట్రేడవుతున్నాయి. బీఎస్ఈలో 981 స్టాక్స్ లాభాల్లో, 185 స్టాక్స్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
Go Back to Shorts
stock market

More Telugu News