పసుపులేటికి అప్పట్లో నేను రూ.100 ఇవ్వబోతే తీసుకోలేదు!: పాత్రికేయుని నిజాయతీని కొనియాడిన చిరంజీవి
- దాసరి నారాయణరావు జీవితంపై సీనియర్ పాత్రికేయుడు పసుపులేటి పుస్తకం
- చిరంజీవి చేతుల మీదుగా ‘తెర వెనుక దాసరి’ పుస్తకం విడుదల
- గతంలో తన గురించి ఆర్టికల్ రాశారని వ్యాఖ్య
ఈ పుస్తకాన్ని రచించిన పాత్రికేయుడు పసుపులేటి రామారావు గురించి చిరు మాట్లాడుతూ.. తాను ఆర్టిస్టుగా వచ్చిన తొలి నాళ్లలో పసుపులేటి తన గురించి ఓ ఆర్టికల్ రాశారని, ఆయనను ప్రశంసిస్తూ రూ.100 ఇవ్వాలని ప్రయత్నించానని, అయితే ఆ ప్రోత్సాహకాన్ని ఆయన సున్నితంగా తిరస్కరించారని అన్నారు. ఆర్టికల్స్ రాయడం తన బాధ్యతని అప్పుడాయన చెప్పారని తెలిపారు. పసుపులేటి మట్టిలో మాణిక్యం లాంటి వ్యక్తని చిరంజీవి అన్నారు. తనకు పసుపులేటి చాలా కాలం నుంచి తెలుసని, ఆయన చాలా నిజాయతీ ఉన్న వ్యక్తి అని అన్నారు.