tea: టీలో మ‌త్తు మందు క‌లిపి ఇచ్చి.. రైలు ప్ర‌యాణికుల‌ను దోచుకున్న దుండగులు!

షార్ట్స్‌లో చూడండి
ఫ‌ల‌క్ నుమా ఎక్స్‌ప్రెస్ రైలులో కేటుగాళ్లు అల‌జ‌డి రేపారు. టీలో మ‌త్తు మందు క‌లిపి ఓ దంప‌తుల‌కు ఇచ్చారు. వారు మ‌త్తులోకి జారుకోగానే వారి వ‌ద్ద నుంచి బంగారు న‌గ‌లు, న‌గ‌దు చోరీ చేశారు. దంప‌తుల నుంచి మొత్తం 12 తులాల బంగారు ఆభ‌ర‌ణాలు, రూ.25 వేల న‌గ‌దును కాజేశారు.

ఆ దంప‌తులు విజ‌య‌వాడ నుంచి సికింద్రాబాద్‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. సికింద్రాబాద్ స్టేష‌న్‌కు వ‌చ్చాక కూడా బాధిత‌ దంప‌తులు ఏసీ బోగీ నుంచి దిగ‌క‌పోవ‌డంతో ఈ విష‌యాన్ని గుర్తించిన‌ రైల్వే సిబ్బందికి అనుమానం వ‌చ్చింది. ఆ దంప‌తులు క‌ళ్లు తెర‌వ‌లేక‌పోవ‌డంతో వారిని వెంట‌నే గాంధీ ఆసుప‌త్రికి త‌ర‌లించి, చికిత్స చేయిస్తున్నారు.   
Go Back to Shorts
tea
railway
bulgars

More Telugu News