నా 'మనసుకు నచ్చింది' అంటూ.. త‌న కొత్త సినిమా ప్రీ లుక్ టీజ‌ర్‌ను విడుద‌ల చేసిన మంజుల‌!

  • మంజుల ద‌ర్శ‌కత్వంలో 'మనసుకు నచ్చింది'
  • ప్రీలుక్ టీజ‌ర్‌లో స‌ముద్ర‌పు ఒడ్డున హీరో, హీరోయిన్లు
  •  సందీప్ కిష‌న్‌, అమైరా ద‌స్త‌ర్‌, త్రిధా చౌద‌రి ప్ర‌ధాన పాత్ర‌లు  
సూప‌ర్ స్టార్ కృష్ణ త‌న‌య మంజుల ద‌ర్శ‌కత్వంలో సందీప్ కిష‌న్‌, అమైరా ద‌స్త‌ర్‌, త్రిధా చౌద‌రి ప్ర‌ధాన పాత్ర‌ల్లో రూపుదిద్దుకుంటోన్న‌ 'మ‌న‌సుకు న‌చ్చింది' సినిమా ప్రీ లుక్ టీజ‌ర్‌ విడుద‌లైంది. 'నా మనసుకు నచ్చింది, మీ మనసుకు కూడా నచ్చుతుంది' అంటూ మంజుల త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా ఈ ప్రీ లుక్‌ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.

ఈ సినిమాను ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, ఇందిరా ప్రొడ‌క్ష‌న్స్ కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు 'ఫాలో యువర్ హార్ట్' అనే ట్యాగ్‌లైన్ పెట్టారు. హీరో, హీరోయిన్లు సముద్రం ఒడ్డున నిలబడి ఉండగా తీసిన సీన్ల‌ను ఈ ప్రీలుక్ టీజ‌ర్‌లో చూపించారు.    
Go Back to Shorts
manjula
manasuku nachindhi
sandip kishan

More Telugu News