మెట్రోరైలులో అమ్మాయిల ఫొటోలు తీస్తూ పట్టుబడిన వృద్ధుడు
- ఉప్పల్-నాగోలు మధ్య పట్టుకున్న షీ టీమ్
- అబ్దుల్లాపూర్‌మెట్ వాసిగా గుర్తింపు
- సెక్షన్ 354 కింద అరెస్టు
తన సీటులో కూర్చుని ఎదురుగా కూర్చున్న అమ్మాయిల ఫొటోలు తీస్తున్న నరసింహను షీ టీమ్ ప్రశ్నించగా తాను మెట్రో రైలు ప్రయాణాన్ని తీస్తున్నట్లు బుకాయించాడు. కానీ తర్వాత అతని ఫోన్లో చూస్తే అన్నీ అమ్మాయిల ఫొటోలే ఉండటంతో సెక్షన్ 354 కింద అరెస్టు చేసి, రిమాండ్‌కి తరలించారు.