రేపు 'ఒక్క క్షణం' మూవీ నుంచి మొదటి పాట రిలీజ్!
- అల్లు శిరీష్ హీరోగా 'ఒక్క క్షణం'
- సంగీత దర్శకుడిగా మణిశర్మ
- ఈ నెల చివరిలో సినిమా రిలీజ్
ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించారు. ఆయన స్వరపరిచిన పాటల్లో నుంచి మొదటి పాటగా 'సో మెనీ .. సో మెనీ' అంటూ సాగే పాటను రేపు మధ్యాహ్నం 1 గంటకు రిలీజ్ చేయనున్నారు. యూత్ కి కనెక్ట్ అయ్యే ఈ పాటతోనే వాళ్లని థియేటర్స్ కి రప్పించే ప్రయత్నంలో వున్నారు. 'ఎక్కడికిపోతావు చిన్నవాడా' తరువాత వి.ఐ. ఆనంద్ నుంచి వస్తోన్న సినిమా కావడంతో, ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి వుంది. అల్లు శిరీష్ జోడీగా సురభి .. శీరత్ కపూర్ కథానాయికలుగా నటించిన సంగతి తెలిసిందే.