Narendra Modi: మీరు అనుకున్న సమయంలో అయోధ్య‌లో రామాలయం నిర్మించ‌లేరు: మోదీపై క‌పిల్ సిబాల్ విమర్శ‌లు

షార్ట్స్‌లో చూడండి
అయోధ్య‌లో రామాలయం ప్ర‌ధాని మోదీ అనుకున్నపుడు రాదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్ వ్యాఖ్యానించారు. రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టులో అయోధ్య భూమి వివాదంపై వాద‌న‌లు జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో సున్నీ వక్ఫ్ బోర్డ్ త‌ర‌ఫున క‌పిల్ సిబాల్ వాదించారు. తాజాగా ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ... అయోధ్యలో రామాలయం శ్రీరాముడు కోరుకున్నప్పుడే వస్తుందని అన్నారు. మోదీ అనుకున్న సమయంలో ఆ ఆల‌యాన్ని నిర్మించడం కుదర‌ద‌ని వ్యాఖ్యానించారు. శ్రీ రాముడిని బీజేపీ నేతలు, మోదీ నమ్ముకున్నారని, కానీ శ్రీ రాముడు మాత్రం వారిని నమ్మడం లేదని ఆయ‌న ఎద్దేవా చేశారు. 
Go Back to Shorts
Narendra Modi
ramalayam
kapil sibal

More Telugu News