కోస్టారికాలో స్కూబా డైవ‌ర్ల‌పై టైగ‌ర్ షార్క్ దాడి... భార‌త సంత‌తి మ‌హిళ మృతి

  • యునెస్కో వార‌స‌త్వ ప్ర‌దేశం కోకో దీవిలో ఘ‌ట‌న‌
  • తీవ్ర‌గాయాల‌వ‌డంతో మ‌ర‌ణించిన రోహినా భండారీ
  • న్యూయార్క్‌లో ఈక్విటీ మేనేజ‌ర్‌గా ప‌నిచేస్తున్న రోహినా
అమెరికాలోని కోస్టారికా దీవుల్లో స్కూబా డైవింగ్ చేస్తున్న ప‌ర్యాట‌కుల‌పై టైగ‌ర్ షార్క్ దాడి చేసింది. ఈ దాడిలో భార‌త సంత‌తి మ‌హిళ రోహినా భండారీకి తీవ్రగాయాల‌వ‌డంతో చికిత్స చేసే లోపే ఆమె మృతి చెందారు. యునెస్కో వార‌స‌త్వ ప్ర‌దేశమైన కోకో దీవి జాతీయ పార్కులో స్కూబా డైవింగ్ చేసేందుకు 18 మంది సంద‌ర్శ‌కులు దిగారు. ఈ దీవి ప్ర‌మాద‌క‌ర‌మైన టైగ‌ర్ షార్క్‌లకు ప్ర‌సిద్ధి.

న్యూయార్క్‌లోని ఓ ఈక్విటీ కంపెనీలో ప‌నిచేసే రోహినా భండారీ కాళ్ల‌కు తీవ్రంగా గాయాల‌య్యాయి. ఆ ప‌క్క‌నే బోటులో ఉన్న‌వారు షార్క్‌ల‌ను త‌రిమేందుకు ప్ర‌య‌త్నించినా కుద‌ర‌లేదు. ఆమెను ఒడ్డుకి తీసుకువ‌చ్చేలోపే స్పృహ‌ కోల్పోయిందని, అనంతరం చికిత్స అందించే లోపే మరణించిందని అక్క‌డి అధికారులు తెలిపారు.
Go Back to Shorts
costarica
tiger shark
killer shark
jaws
indian origin
rohina bhandari

More Telugu News