haranath: హరనాథ్ కి నేనంటే భయం .. ఒకసారి తాగేసి షూటింగుకి వచ్చాడు : జమున

షార్ట్స్‌లో చూడండి
ఎన్టీఆర్ .. ఏఎన్నార్ తో ఎన్నో విజయవంతమైన సినిమాలు చేసిన జమున, హరనాథ్ తోను హిట్ మూవీలు చేశారు. అప్పట్లో ఈ కాంబినేషన్ కి ఎంతో క్రేజ్ ఉండేది .. ఈ ఇద్దరిని ప్రేక్షకులు 'హిట్ పెయిర్' గా చూసేవారు. అలాంటి హరనాథ్ తో తాను చేసిన సినిమాల గురించి చెబుతూ .. అప్పట్లో జరిగిన ఒక సంఘటన గురించి జమున ప్రస్తావించారు.

 "మా కాంబినేషన్లో మంచి సినిమాలు పడ్డాయి .. ఒక స్టేజ్ కి వచ్చేసరికి హరనాథ్ తో నేను చేయనని చెప్పేశాను. ఆయనతో చేయాలంటే విసుగొచ్చేసింది. నేనంటే ఆయనకి భయం .. నాతో షూటింగ్ వుంటే తాగేవాడు కాదు. ఒక రోజున ఉదయం సెట్లో నేను లేననుకుని తాగేసి వచ్చాడు. దాంతో ఇక ఆయనతో చేయనని చెప్పేశాను. ఆయనకి మత్తు దిగిన తరువాత మధ్యాహ్నం షూటింగ్ చేయమని డైరెక్టర్ తో అన్నాను. షూటింగ్ చివరిరోజు కావడం వలన అలాగే కానిచ్చేశారు. ఆ తరువాత నుంచి ఆయనతో సినిమాలు చేయలేదు" అంటూ చెప్పుకొచ్చారు.    
Go Back to Shorts
haranath
jamuna

More Telugu News