రవితేజ న్యూ మూవీకి సన్నాహాలు .. లొకేషన్ల వేటలో శ్రీను వైట్ల!
- శ్రీను వైట్లతో రవితేజ సినిమా
- ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి
- త్వరలో మిగతా నటీనటుల ఎంపిక
కథా పరంగా ఈ సినిమా షూటింగ్ అమెరికాలోను జరగనుందట. అందువలన లొకేషన్స్ చూడటానికి శ్రీను వైట్ల అమెరికా వెళ్లాడు. అక్కడి లొకేషన్స్ ను ఖరారు చేసుకుని త్వరలోనే ఆయన తిరిగి రానున్నాడని అంటున్నారు. ఆల్రెడీ ఆయన పూర్తి స్క్రిప్ట్ ను రెడీ చేయడం .. రవితేజ - నిర్మాతలు ఓకే చెప్పేయడం జరిగిపోయాయట. మిగతా నటీనటులను .. సాంకేతిక నిపుణులను ఎంపిక చేయవలసి ఉందంతే.