ఐరాస కోర్టులో కలకలం... శిక్షను విని విషం తాగి మరణించిన బోస్నియా నేత!
- బోస్నియా నేత స్లోబోడన్ ప్రల్జాక్ కు 20 ఏళ్ల జైలు శిక్ష
- 'మీ తీర్పును నేను వ్యతిరేకిస్తున్నాను' అంటూ ప్రల్జాక్ కేకలు
- ఆపై విషం తాగిన నేత, ఆసుపత్రిలో మృతి
ప్రల్జాక్ తో పాటు మరో ఐదుగురు బోస్నియాలోని క్రోట్స్ నేతలకు 10 నుంచి 25 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ అంతకుముందు న్యాయమూర్తులు తీర్పిచ్చారు. 1990 దశకంలో యుగోస్లావియా రిపబ్లిక్ కొనసాగిన రోజుల్లో మూడు వర్గాల మధ్య వైషమ్యాలు తలెత్తగా, సుమారు లక్ష మందికి పైగా ప్రజలు మరణించారు. ఈ కేసు విచారణ సుదీర్ఘంగా సాగగా, నిందితులకు ఇంతకాలానికి శిక్ష పడింది. ఇక, ఈ తీర్పు వెలువడిన తరువాత క్రొయేషియాలో కలకలం చెలరేగింది. పార్లమెంట్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. చారిత్రక నిజాలను పక్కనబెట్టి తీర్పిచ్చారని అసెంబ్లీ స్పీకర్ జాగరెబ్ ఆరోపించారు. ఈ ఘటనపై డచ్ అధికారులు విచారణ ప్రారంభించినట్టు 'హినా' పేర్కొంది.