మియాపూర్‌లో హైదరాబాద్ మెట్రోరైల్ పైలాన్‌ను ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- కాసేపట్లో మెట్రోరైల్ ప్రారంభం
- మెట్రోరైల్ దృశ్యమాలిక, బ్రోచర్ విడుదల
- రేపటి నుంచి ప్రయాణికులకు మెట్రోరైల్ సేవలు
కాసేపట్లో ప్రధాని మెట్రోరైల్ సేవలను ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్‌తో కలిసి మెట్రో రైలులో మియాపూర్ నుంచి కూకట్‌పల్లికి ప్రయాణించి, మళ్లీ అదే రైల్‌లో తిరిగి మియాపూర్‌కి వచ్చి హైటెక్స్‌కు పయనం అయి అమెరికా అధ్యక్షుడి కూతురు, సలహాదారు ఇవాంక ట్రంప్‌తో భేటీ అవుతారు. రేపటి నుంచి హైదరాబాద్ వాసులు మెట్రోరైల్‌లో ప్రయాణించవచ్చు.