బీ కేర్‌ఫుల్.. ఆ ఎస్సెమ్మెస్‌లు నమ్మొద్దు.. హెచ్చరించిన ఎల్ఐసీ
- పాలసీలకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ చేపట్టలేదన్న ఎల్ఐసీ
- ఆధార్ నంబరు కోరుతూ వచ్చే మెసేజ్‌లను పట్టించుకోవద్దని సూచన
- తాము చేపట్టే ముందు సమాచారం ఇస్తామని స్పష్టీకరణ
ఈ నంబరకు మీ ఆధార్ నంబరును పంపడం ద్వారా పాలసీతో ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాలని కోరుతూ వినియోగదారులకు మెసేజ్‌లు వస్తున్నట్టు ఎల్ఐసీ అధికారులు తెలిపారు. ఎల్ఐసీ లోగోతో ఈ మెసేజ్‌లు పంపుతూ నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. తామైతే ఇప్పటి వరకు అనుసంధాన ప్రక్రియ చేపట్టలేదని, కాబట్టి వాటిని పొరపాటున కూడా నమ్మవద్దని సూచించారు. ఒకవేళ తామే కనుక ఆ ప్రక్రియ చేపడితే అందుకు సంబంధించిన వివరాలను తమ వెబ్సైట్లో పొందుపరుస్తామని వివరించారు.
బీమా పాలసీదారులు తమ పాలసీని ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని ఇటీవల బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రంగంలోకి దిగి ఈ ఎస్సెమ్మెస్‌లను పంపిస్తున్నారు.