ఇవి కచ్చితంగా ఎల్లో నందులే: నటుడు జీవీ సంచలన వ్యాఖ్య

  • ద్రాక్షారామంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన జీవీ
  • నంది అవార్డులపై అసంతృప్తి
  • పదేళ్లుగా ముస్లిం విద్యార్థులను చదివిస్తున్నానని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై తన అసంతృప్తిని వెళ్లగక్కాడు నటుడు జీవీ సుధాకర్ నాయుడు. తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన, మీడియాతో మాట్లాడుతూ చిత్ర పరిశ్రమను, నంది అవార్డులను ఏపీ ప్రభుత్వం 'ఎల్లో'గా మార్చివేసిందని విమర్శించాడు.

చిత్ర పరిశ్రమకు తాను దాసరి నారాయణరావు ప్రోద్బలంతో వచ్చానని, తనకు చిరంజీవిపై ఉన్న అభిమానాన్ని గురించి తెలుసుకున్న దాసరి, తన పేరు ప్రారంభంలో చిరంజీవి పేరులోని చివరి రెండు అక్షరాలనూ చేర్చారని అన్నాడు. ఆ విధంగా తన పేరు ముందు జీవి స్థిరపడిందని చెప్పిన సుధాకర్ నాయుడు, త్వరలోనే వంగవీటి సినిమాను తాను స్వయంగా తీయనున్నట్టు చెప్పాడు. హైదరాబాద్ లో గత పదేళ్లుగా 100 మందికి పైగా పేద ముస్లిం విద్యార్థినీ విద్యార్థులను తాను చదివిస్తున్నట్టు చెప్పుకున్నాడు.
Go Back to Shorts
gv sudhakar naidu
nandi awards

More Telugu News