ఇట్స్ అఫీషియల్... చిరంజీవి 'సైరా' నుంచి తప్పుకున్న రెహ్మాన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇట్స్ అఫీషియల్... చిరంజీవి 'సైరా' నుంచి తప్పుకున్న రెహ్మాన్

  • నాది చాలా బిజీ షెడ్యూల్
  • చిరంజీవి అంటే ఇష్టమే
  • అయినా తప్పుకోవాల్సి వస్తోంది
  • వెల్లడించిన ఏఆర్ రెహమాన్
మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం 'సైరా' నుంచి తాను తప్పుకుంటున్నట్టు ఆస్కార్ అవార్డు విజేత, ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అధికారికంగా ప్రకటించారు. హైదరాబాద్ లో నిర్వహిస్తున్న తన లైవ్ షో సందర్భంగా కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన రెహమాన్, ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు. తనకు చిరంజీవి అంటే చాలా ఇష్టమని చెప్పిన రెహమాన్, ఎంతో బిజీ షెడ్యూల్ కారణంగానే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టుగా తెలిపారు. ఇప్పటికే ఈ సినిమా సినిమాటోగ్రాఫర్ గా తొలుత రవివర్మన్ పేరును చెప్పిన నిర్మాణ టీమ్, ఈ ప్రాజెక్ట్ నుంచి ఆయన తప్పుకోగా, ఆ స్థానంలో రత్నవేలును తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక మ్యూజిక్ డైరెక్టర్ గా ఎవరిని తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
saira
Chiranjeevi
ar rehaman

More Telugu News