snake: ఇంద్ర‌కీలాద్రి క్యూలైన్ వ‌ద్ద‌కు పాము.. భ‌యంతో భ‌క్తుల ప‌రుగులు

షార్ట్స్‌లో చూడండి
విజయవాడ క‌న‌క‌దుర్గ అమ్మవారిని ద‌ర్శించుకోవ‌డం కోసం క్యూలైన్‌లో నిల్చున్న భ‌క్తుల్లో ఓ పాము ఆందోళ‌న రేపింది. దుర్గ‌గుడి సమీపంలోని పచ్చిక నుంచి వ‌చ్చిన ఆ పామును చూసిన భ‌క్తులు త‌మ భ‌క్తిని ప‌క్కకు పెట్టేసి ప్రాణ భ‌యంతో ప‌రుగులు తీశారు. దుర్గ గుడి క్యూలైన్ వ‌ద్ద అల‌జ‌డి చెల‌రేగుతుండ‌డంతో గ‌మ‌నించిన అక్క‌డి సిబ్బంది వెంట‌నే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్క‌డ‌కు చేరుకున్న అట‌వీ శాఖ సిబ్బంది పామును పట్టుకుని అక్కడి నుంచి తరలించారు. దీంతో భ‌క్తులు ఊపిరి పీల్చుకున్నారు.
Go Back to Shorts
snake
Vijayawada
temple

More Telugu News