దేశాలు దాటుతూ.. మధ్యధరా సముద్రంలో 33 వేల మంది జలసమాధి అయ్యారు: ఐక్యరాజ్యసమితి
- ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సరిహద్దుల్లో మధ్యధరా సముద్రానిది అగ్రస్థానం
- 2000 నుంచి 2016 వరకూ మధ్యధరా సముద్రం గుండా ప్రయాణిస్తూ 33,000 మంది జలసమాధి
- శరణార్ధులను ఆదుకునే విషయంలో యూరోపియన్ యూనియన్, టర్కీతో ఒప్పందం
అయితే శరణార్ధులను ఆదుకునే విషయంలో యూరోపియన్ యూనియన్, టర్కీతో ఒప్పందం చేసుకోవడం వల్ల కొన్ని మరణాలను తగ్గించగలిగిందని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎమ్) అభిప్రాయపడింది. ఈ ప్రకటనను యూరోపియన్ యూనివర్సిటీ అధ్యాపకుడు ఫిలిప్ తప్పుబట్టారు. వాస్తవానికి మధ్యధరా పొట్టనబెట్టుకున్న వారి సంఖ్య 33 వేలకు పైమాటేనని ఆయన అన్నారు. కేవలం 2017లోనే యూరోపియన్ యూనియన్ కు దాదాపు లక్షా 61 వేల మంది శరణార్థులు చేరుకున్నట్టు ఐవోఎం వెల్లడించిందని, ఈ క్రమంలో ఎంతో మంది నడిసంద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.