ఒక సామాన్యుడిలా పిల్లలతో కలసి క్యూలైన్లో నిలబడ్డ ద్రావిడ్.. ఇంటర్నెట్ ను ఊపేస్తున్న ఫొటో

  • తన పిల్లలతో కలసి సైన్స్ ఎగ్జిబిషన్ కు వెళ్లిన ద్రావిడ్
  • సాధారణ వ్యక్తిలా క్యూలైన్లో మిస్టర్ వాల్
  • మచ్చుకు కూడా కనిపించని సెలబ్రిటీ దర్పం
భారతీయ క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ నిజ జీవితంలో ఎంతో సామాన్యమైన జీవితాన్ని గడుపుతుంటాడు. సెలబ్రిటీ ఇమేజ్ కు దూరంగా ఉంటాడు. మీడియాకు కూడా అందుబాటులో ఉండడు. సోషల్ మీడియాలో కూడా హడావుడి ఉండదు. తన సింప్లిసిటీతో ద్రావిడ్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు.

ఇటీవలే ద్రావిడ్ తన ఇద్దరు పిల్లలతో కలసి ఓ సైన్స్ ఎగ్జిబిషన్ కు వెళ్లాడు. అక్కడ అందరితో కలసి క్యూ లైన్లో నిలబడ్డాడు. తమ పక్కనే ఉన్న ద్రావిడ్ ను చూసి అక్కడున్నవారంతా ఆశ్చర్యచకితులయ్యారు. ద్రావిడ్ మాత్రం ఇదేదీ పట్టించుకోకుండా ఓ సామాన్యుడిలా క్యూలో నిలబడ్డాడు. సెలబ్రిటీ అనే దర్పాన్ని మచ్చుకు కూడా చూపించలేదు. ఈ ఫొటోను తీసిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇప్పుడు ఈ ఫొటో ఇంటర్నెట్ ను ఊపేస్తోంది. నెటిజన్లు రాహుల్ కు జేజేలు పలుకుతున్నారు. 
Go Back to Shorts
rahul dravid
team india

More Telugu News