akhil: 'హలో' సినిమాలో అఖిల్ తల్లిదండ్రులుగా జగపతిబాబు .. రమ్యకృష్ణ!

షార్ట్స్‌లో చూడండి
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా 'హలో' సినిమా రూపొందింది. కల్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటించిన ఈ సినిమాను, క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి అఖిల్ ఒక పిక్ ను రిలీజ్ చేశాడు. తన అమ్మా నాన్న అంటూ జగపతి బాబు .. రమ్యకృష్ణ పాత్రలను పరిచయం చేశాడు. అఖిల్ తో పాటు జగపతిబాబు .. రమ్యకృష్ణ లుక్స్ కూడా చాలా బాగున్నాయి.

 కథా పరంగా హీరో రాయల్ ఫ్యామిలీకి చెందినవాడనే విషయం ఈ పిక్ ను బట్టే తెలిసిపోతోంది. మొదటి సినిమాలో కంటే ఈ సినిమాలో అఖిల్ మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో నాగార్జున నిర్మిస్తోన్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకోవడమెలాగో విక్రమ్ కుమార్ కి బాగా తెలుసు. అందువలన ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.    
Go Back to Shorts
akhil
kalyani priyadarshan

More Telugu News