నంది అవార్డులపై స్పందించేందుకు నిరాకరించిన నారా బ్రాహ్మణి
Add ap7am to your home Screen

నంది అవార్డులపై స్పందించేందుకు నిరాకరించిన నారా బ్రాహ్మణి

  • స్పందించేందుకు సరైన వేదిక కాదన్న బ్రాహ్మణి
  • మా నాన్నకు అవార్డు రావడం సంతోషకరం
  • విజేతలందరికీ శుభాకాంక్షలు
2014, 2015, 2016 సంవత్సరాలకు గాను ఏపీ ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డులకు సంబంధించి కొందరు సంతోషంగా ఉండగా, మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, సినీ పరిశ్రమ రెండుగా చీలిపోయిందంటూ వ్యాఖ్యానిస్తున్నవారూ ఉన్నారు.

ఇలాంటి తరుణంలో ఈ అవార్డులపై స్పందించేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోడలు, మంత్రి లోకేష్ భార్య నారా బ్రాహ్మణి నిరాకరించారు. అవార్డుల గురించి ఆమెను మీడియా ప్రశ్నించగా... దీనిపై స్పందించడానికి ఇది సరైన వేదిక కాదంటూ సమాధానమిచ్చారు. తన తండ్రి బాలకృష్ణకు అవార్డు రావడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. అవార్డు విజేతలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ కు 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ట్రస్ట్ భవన్ లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పైవిధంగా స్పందించారు. 
nara brahmini
Nara Lokesh
chandrababu
nandi awards

More Telugu News