Pawan Kalyan: లండన్ చేరుకున్న పవన్ కల్యాణ్.. నేడే అవార్డు ప్రదానం!
జనసేన అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్ నేటి తెల్లవారు జామున లండన్ చేరుకున్నారు. పవన్ కల్యాణ్ కు 'ఇండియా-యూరోపియన్ బిజినెస్ ఫోరం' ఎక్స్‌లెన్సీ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డు అందుకునేందుకు ఆయన లండన్ వెళ్లారు. రెండు రోజులపాటు లండన్ లో ఉండే పవన్ కల్యాణ్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.