భర్త పాడిన పాటకు కరిగిపోయిన భార్య.. అతని గుండెలకు హత్తుకున్న వైనం... ఢిల్లీ పోలీసులు షేర్ చేసుకున్న వీడియో!
- మనస్పర్థలతో కేసులు పెట్టుకున్న జంట
- కౌన్సెలింగ్ వేళ, అనూహ్యంగా మారిన పరిస్థితి
- పాట పాడి భార్యను ఐస్ చేసిన భర్త
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
ఝాన్సీ పోలీసు అధికారుల ముందే ఈ ఘటన జరుగగా, ఢిల్లీ పోలీస్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ మధుర్ వర్మ దీన్ని తన ట్విట్టర్ ఖాతాలో 'లవ్ ట్రియంప్స్' అనే క్యాప్షన్ పెట్టి, మూడు రోజుల క్రితం షేర్ చేసుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.