స్టీఫెన్ హాకింగ్ హెచ్చరికలు పట్టించుకోని చైనా... ఏలియన్స్ ను కెలికే ప్రయత్నం!
- ఏలియన్స్ తో మాట్లాడేందుకు 500 మీటర్ల గోళాకార టెలిస్కోప్ కలిగిన రేడియో డిష్ సిద్ధం చేస్తున్న చైనా
- సుదూర పాలపుంతల్లోని ఏలియన్స్ తో మాట్లాడేందుకు సిగ్నల్స్
- ఏలియన్స్ జోలికెళ్లడం ప్రపంచానికి ప్రమాదకరమని హెచ్చరించిన స్టీఫెన్ హాకింగ్
ఇప్పటికే అంతరిక్ష ప్రయోగాలతో దూసుకుపోతున్న చైనా, ఇందుకోసం వందల కోట్ల రూపాయలను ఖర్చుచేయనుంది. అయితే దీనిపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏలియన్స్ మనిషికంటే తెలివైనవని, వాటితో ప్రపంచానికి ముప్పు ఏర్పడవచ్చని వారు ఆందోళన చెందుతున్నారు. అయితే చైనా సాహసాన్ని కూడా పలువురు శాస్త్రవేత్తలు స్వాగతిస్తున్నారు. మనిషికి తోడుగా మరోజీవి ఉందన్న విషయం నిర్ధారణ అవుతుందని వారు పేర్కొంటున్నారు.