విరాట్ తో కలిసి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాలని ఉంది!: ఐర్లాండ్ రెజ్లర్ ఆసక్తికర ప్రకటన
- కోహ్లీకి కొత్త అభిమాని 'డబ్ల్యూడబ్ల్యూఈ' రెజ్లర్ ఫిన్ బలోర్
- కోహ్లీతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాలని ఉంది
- తను ఓకే అంటే రెండు రౌండ్లు రెజ్లింగ్ కూడా.. అంటున్న రెజ్లర్
అయితే, తనకు క్రికెట్ గురించి పెద్దగా తెలియదని, ఒకసారి ఐర్లాండ్-ఆస్ట్రేలియా దేశాల మధ్య జరిగిన ఒక మ్యాచ్ ను చూశానని చెప్పాడు. దీంతో ఆ ఆటకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలని అనిపించిందని అన్నాడు. భారత్-ఐర్లాండ్ దేశాల మధ్య ఒక క్రికెట్ మ్యాచ్ జరిగితే అది తనకు ఎంతో గర్వకారణమని ఫిన్ బలోర్ తెలిపాడు.
కాగా, ఫిన్ బలోర్ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్. ఈ ఆటకు యువతలో విశేషమైన ఆసక్తి వ్యక్తమవుతుంది. ఈ ఏడాది చివర్లో భారత్ లో డబ్ల్యూడబ్ల్యూఈ టోర్నీ జరగనుంది. దీనికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు.