మీ అరుపులకు జగనే కాదు.. ఆయన ఇంట్లోని కుక్క కూడా భయపడదు: రోజా
- నారా నరకాసురుడు చంద్రబాబు
- టీడీపీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది
- సోనియా, మోదీలాంటి వాళ్లతో కొట్లాటకు కూడా జగన్ సిద్ధమే
వైయస్ కుటుంబానికి పదవులు ముఖ్యం కాదని... ప్రజలే ముఖ్యమని రోజా అన్నారు. రాష్ట్ర సంక్షేమం కోసం సోనియా, మోదీలాంటి వాళ్లతో కొట్లాటకు కూడా జగన్ సిద్ధమేనని చెప్పారు. చంద్రబాబు పాలనలో మహిళల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. ఈ రోజు నుంచి టీడీపీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని అన్నారు. టీడీపీ తప్పులను లెక్కకట్టడానికే జగన్ ఈ రోజు నుంచి ప్రజల ముందుకు వస్తున్నారని చెప్పారు. చంద్రబాబు, టీడీపీ నేతలు అరిచే అరుపులకు జగన్ కాదు కదా... ఆయన ఇంట్లో ఉండే కుక్క కూడా భయపడదని ఎద్దేవా చేశారు.