హిట్లర్, సద్దాం హుస్సేన్, ఫిడేల్ క్యాస్ట్రో వంటి పేర్లతో ఇబ్బంది పడుతున్న వ్యక్తులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హిట్లర్, సద్దాం హుస్సేన్, ఫిడేల్ క్యాస్ట్రో వంటి పేర్లతో ఇబ్బంది పడుతున్న వ్యక్తులు!

  • పాలస్తీనాలో ప్రముఖుల పేర్లు పెట్టే సంప్రదాయం
  • హిట్లర్లు, సద్దాం హుస్సేన్ లు, క్యాస్ట్రోలు, జిమ్మీ కార్టర్ లు, బెంజిమన్ నెతన్యాహూలు, హాలీవుడ్ నటుల పేర్లు కలిగిన వ్యక్తులు
  • ఆ పేర్లతో ఇబ్బంది పడుతున్న ఆయా వ్యక్తులు 
జర్మనీ నియంత హిట్లర్‌, ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌, క్యూబా అధ్యక్షుడు ఫిడేల్‌ క్యాస్ట్రో వివిధ కాలాలకు చెందిన వారు. అలాంటి వారు కలిసి బార్ కెళ్లడమేంటన్న అనుమానం వచ్చిందా? అయితే మీ అనుమానం నిజమే. హిట్లర్, సద్దాం హుస్సేన్, ఫిడేల్ క్యాస్ట్రో కలిసి బార్ కు వెళ్లిన మాట వాస్తవమే కానీ, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆ ముగ్గురూ మాత్రం కాదు.

పాలస్తీనాలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు తమ పిల్లలకు ఇలా ప్రముఖుల పేర్లు పెట్టడం సంప్రదాయంగా వస్తోంది. దీంతో అక్కడ హిట్లర్లు, సద్దాం హుస్సేన్ లు, క్యాస్ట్రోలు, జిమ్మీ కార్టర్ లు, బెంజిమన్ నెతన్యాహూలు, హాలీవుడ్ నటుల పేర్లు కలిగిన వారు, జాతీయ, అంతర్జాతీయ నేతల పేర్లు, ఉద్యమాలు చేసిన వారి పేర్లు కలిగిన వారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.

అయితే, ఈ పేర్లతో వారంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వారు చెబుతున్నారు. తన పేరు హిట్లర్ కానీ తాను ఆయనలాంటి వాడిని కాదని, తనకు హింస ఇష్టం ఉండదని ఒకతను చెబుతున్నాడు. అయినప్పటికీ తన పేరు కారణంగా ఎంతో మంది తనను అసహ్యించుకుంటారని కూడా గుర్తు చేసుకున్నాడు. అయితే అది తన తల్లిదండ్రులు పెట్టిన పేరు మాత్రమేనని, తాను అలాంటి వాడిని కాదని ఆయన చెబుతున్నాడు. 
palastina
hitlar
saddam
castro
names

More Telugu News