Raghuveera Reddy: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో డ్వాక్రా మ‌హిళ‌ల‌కు పూర్తి రుణమాఫీ చేయాలి: ర‌ఘువీరారెడ్డి

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో డ్వాక్రా మ‌హిళ‌ల‌కు పూర్తి రుణమాఫీ చేయాలని, అలాగే వారికి కొత్త‌గా వడ్డీలేని రుణాలు మంజూరు చేయాలని ఏపీసీసీ అధ్యక్షుడు ర‌ఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. ఈ రోజు అనంతపురం జిల్లా అగళి మండలంలో ప‌ర్య‌టించిన ర‌ఘువీరారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... గతంలో రేషన్ దుకాణంలో 9 రకాల సరుకులు ఇచ్చేవార‌ని, ఇప్పుడు కూడా ఆ స్థాయిలోనే స‌రుకులు అందించాల‌ని అన్నారు.

కాగా, ఇందిరమ్మ తాగునీటి, సాగునీటి పథ‌కాలకు కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు గండికొడుతున్నాయ‌ని ఆయన విమర్శించారు. మళ్లీ ఇందిరమ్మ రాజ్యం వచ్చేంతవరకు ఈ రాక్షస పాలనను ఎండగ‌డ‌తామ‌ని అన్నారు. గరిబీ హటావో అన్న ఇందిర‌మ్మ‌ నినాదం, సాంకేతిక విప్లవం తీసుకొచ్చిన రాజీవ్ గాంధీ ఆశయాలు నెర‌వేరాల‌ని ప్ర‌జ‌లు కోరుకుంటున్నార‌ని చెప్పారు. జీఎస్టీ, నోట్ల రద్దుతో కేంద్ర ప్ర‌భుత్వం ప్రజల నడ్డి విరగ్గొట్టింద‌ని అన్నారు.  
Go Back to Shorts
Raghuveera Reddy
protest
Modi

More Telugu News