6 కోట్లతో 40 కోట్లు రాబట్టిన మలయాళ మూవీ .. ఓటీటీలో!

Bharathanatyam 2  Mohiniyattam Movie Update
  • మలయాళంలో రూపొందిన సినిమా 
  • డార్క్ కామెడీ నేపథ్యంలో నడిచే కథ 
  • ఏప్రిల్ 10వ తేదీన విడుదలైన సినిమా
  • ఈ నెల 8 నుంచి 'నెట్ ఫ్లిక్స్' లో స్ట్రీమింగ్    

ఎవరైనా తమ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలని భావిస్తారు. ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా, ప్రశాంతంగా గడిచిపోవాలని కోరుకుంటారు. అలాంటి ఒక ఫ్యామిలీ ఒక హత్యకి కారణమైతే .. ఆ హత్యానేరం తమపై పడకుండా ఆ శవాన్ని మాయం చేయడానికి ట్రై చేస్తే ఎలా ఉంటుంది? అనే ఒక కథతో రూపొందిన మలయాళ  సినిమానే 'భరత నాట్యం 2: మోహినీయాట్టం'. 

బ్లాక్ కామెడీ నేపథ్యంలో 2024లో 'భారత నాట్యం' అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాకి మంచి ఆదరణ లభించింది. దాంతో ఆ సినిమాకి సీక్వెల్ గా 'భరతనాట్యం 2: మోహినీ యాట్టం' రూపొందించారు. ఈ ఏడాది ఏప్రిల్ 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేశారు. 6 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా, 40 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టడం విశేషంగా చెప్పుకోవాలి. అలాంటి ఈ సినిమా, ఈ నెల 8వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్' లో స్ట్రీమింగ్ కానుంది.  మలయాళంతో పాటు, తెలుగు .. తమిళ .. కన్నడ .. హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.

కథ విషయానికి వస్తే, శశి తండ్రి భరత్ నాయర్ చనిపోతాడు. అతనికి మరో ఫ్యామిలీ కూడా ఉందని తెలుసుకున్న శశి, వాళ్లను కూడా ఆదరిస్తాడు. ఆ సమయంలో వచ్చిన భరత్ నాయర్ పాత స్నేహితుడు గోవిందరాజు, ఒక విషయంగా ఆ ఫ్యామిలీని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెడతాడు. అనుకోకుండా ఆ ఫ్యామిలీ చేతిలో చనిపోతాడు. అతను బయటపెడతానన్న ఆ నిజం ఏమిటి? ఆ శవాన్ని మాయం చేయడానికి వాళ్లు ఏం చేస్తారు? అనేదే కథ.

Go Back to Shorts
Bharata Natyam 2 Mohiniyattam
Malayalam movie
OTT release
Netflix
Telugu dubbed movie
crime comedy
family drama
Malayalam cinema 2024

More Telugu News