రెండేళ్ల క్రితమే విజయ్ సీఎం అని చెప్పారా?.. 'గోట్' సినిమాలోని కార్ నంబర్ వైరల్!

Vijay to be CM Predicted Two Years Ago GOAT Car Number Viral
  • నటుడు విజయ్ 'గోట్' సినిమాలోని ఓ వీడియో క్లిప్ నెట్టింట‌ వైరల్
  • ఆ కారు నంబర్ ప్లేట్‌పై 'TN 07 CM 2026' అని ఉండటంతో పెరిగిన ఆసక్తి
  • రెండేళ్ల క్రిత‌మే దర్శకుడు వెంకట్ ప్రభు ఊహించారా? అంటూ నెటిజన్ల ఆశ్చర్యం
  • తమిళనాడు ఎన్నికల్లో విజయ్ 'తమిళగ వెట్రి కళగం' పార్టీకి అనూహ్య విజయం
  • త్వ‌ర‌లో త‌మిళ‌నాడు సీఎంగా విజ‌య్ బాధ్య‌త‌లు చేప‌ట్టే అవ‌కాశం
తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) సంచలన విజయం సాధించిన‌ వేళ, సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన చర్చ మొదలైంది. విజయ్ 2026లో ముఖ్యమంత్రి అవుతారని రెండేళ్ల క్రితమే దర్శకుడు వెంకట్ ప్రభు ఊహించారా? అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం 2024లో విడుదలైన 'G O A T' (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) సినిమాలోని ఓ వీడియో క్లిప్ ఇప్పుడు వైరల్ కావడమే.

ఈ క్లిప్‌ను నటుడు, సంగీత దర్శకుడు ప్రేమ్‌జీ అమరన్ తన 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ చేశారు. ఇందులో విజయ్ ఒక కారులో కూర్చుని ప్రేమ్‌జీతో సరదాగా మాట్లాడుతుంటారు. అయితే, అందరి దృష్టినీ ఆకర్షించింది మాత్రం ఆ కారు రిజిస్ట్రేషన్ నంబర్. దానిపై 'TN 07 CM 2026' అని స్పష్టంగా కనిపిస్తుంది. దీని అర్థం 'తమిళనాడు, చీఫ్ మినిస్టర్, 2026' అని వ్యాఖ్యానిస్తూ, "అప్పుడే దర్శకుడు వెంకట్ ప్రభు ఊహించారు" అని ప్రేమ్‌జీ క్యాప్షన్ పెట్టారు. ఈ పోస్ట్‌కు దర్శకుడు వెంకట్ ప్రభు నవ్వుతున్న ఎమోజీలతో బదులిచ్చారు. 2024లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజ‌యాన్ని అందుకుంది.
Go Back to Shorts
Vijay
Vijay Thalapathy
Tamil Nadu politics
Greatest of All Time
GOAT movie
Venkat Prabhu
Premji Amaran
TN CM 2026
Tamilaga Vettri Kazhagam
TVK

More Telugu News