దాసరి నారాయణరావు గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురైన మోహన్ బాబు

Mohan Babu Gets Emotional Talking About Dasari Narayana Rao
  • హైదరాబాద్‌లో వైభవంగా జరిగిన డైరెక్టర్స్ డే వేడుకలు
  • దర్శకుడు అనే పదానికి నిలువెత్తు అర్థం దాసరి అన్న మోహన్ బాబు
  • తండ్రి లాంటి వ్యక్తిని కోల్పోయాననే బాధ తనలో ఎప్పటికీ ఉంటుందని వ్యాఖ్య

తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుడు దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లో ‘డైరెక్టర్స్‌ డే 2026’ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన గురువు దాసరిని గుర్తుచేసుకుంటూ ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. 


దర్శకుడు అనే పదానికి నిలువెత్తు అర్థం దాసరి గారేనని, తండ్రి లాంటి వ్యక్తిని కోల్పోయాననే బాధ తనలో ఎప్పటికీ ఉంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడో ఉన్న తనను ఇండస్ట్రీకి పరిచయం చేసి, ‘మోహన్ బాబు’ అని నామకరణం చేసి ఈ స్థాయికి తెచ్చింది ఆయనేనని కొనియాడారు. ఇదే క్రమంలో డైరెక్టర్ అసోసియేషన్‌కు తన వంతుగా రూ.15 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.


నటి జయసుధ మాట్లాడుతూ...  ప్రపంచంలోని ఏ అవార్డు అయినా దాసరి గారి పేరిట ఇచ్చే అవార్డు కంటే గొప్పది కాదని పేర్కొన్నారు. ఎంతో మంది నటీనటులను స్టార్స్‌గా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. ఈ వేడుకలో బాబూమోహన్ తో పాటు పలువురు ప్రముఖులు కూడా పాల్గొని దాసరి గారితో తమకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. పరిశ్రమలోని దర్శకులందరూ ఏకమై ఈ వేడుకను జరుపుకోవడం దాసరి గారికి ఇచ్చే నిజమైన నివాళి అని అతిథులు అభిప్రాయపడ్డారు.

Go Back to Shorts
Dasari Narayana Rao
Mohan Babu
Director's Day 2026
Telugu Cinema
Telugu Film Industry
Jayaprada
Director Association
Babumohan
Tollywood
Telugu Directors

More Telugu News