ఇద్దరు హీరోలకు ఓ నిర్మాత నాపై లేనిపోనివి చెప్పి దూరం చేశాడు: బ్రహ్మాజీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇద్దరు హీరోలకు ఓ నిర్మాత నాపై లేనిపోనివి చెప్పి దూరం చేశాడు: బ్రహ్మాజీ

  • ఆ నిర్మాతం నైజం అది 
  • ఇద్దరు హీరోలకు నన్ను శత్రువును చేశాడు
  • 6 నెలల పాటు మనశ్శాంతి లేకుండాపోయింది 
  • చివరికి ఆయనే బయటికి వెళ్లిపోయాడు  
బ్రహ్మాజీ మంచి నటుడు అనే విషయాన్ని అందరూ అంగీకరిస్తారు. ఎన్నో సినిమాల్లో విభిన్నమైన పాత్రలను చేసి ఆయన మెప్పించాడు. అలాంటి బ్రహ్మాజీ ఐ డ్రీమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఉండగా .. "మీ జీవితంలో వృత్తిపరంగా వ్యక్తిగతంగా మిమ్మల్ని బాగా బాధ పెట్టిన సంఘటన ఏదైనా ఉందా?" అనే ప్రశ్న ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. "ఓ వ్యక్తి రియల్ ఎస్టేట్ రంగంలో అడ్డంగా సంపాదించేసి నిర్మాతగా మారిపోయి, సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. ఆయన వచ్చి ఇండస్ట్రీని పొల్యూట్ చేసి వెళ్లాడు" అని చెప్పారు.

"తన పబ్బం గడుపుకోవడం కోసం ఒకరి గురించి మరొకరికి ఆ నిర్మాత చెబుతుండేవాడు. ఒకసారి అలా హీరోల డేట్స్ సంపాదించుకోవడం కోసం నా పేరు వాడుకుని .. ఓ గొడవలో నన్ను ఇరికించాడు. అలా ఆ ఇద్దరు హీరోలకి .. నాకు మధ్య శత్రుత్వం సృష్టించాడు. ఈ కారణంగా ఓ 6 నెలల పాటు చాలా బాధపడ్డాను. ఆ తరువాత ఆ నిర్మాత ఇండస్ట్రీ నుంచే బయటికి వెళ్లిపోయాడు .. దూరమైపోయిన ఆ ఇద్దరు హీరోలు నన్ను అర్థం  చేసుకున్నారు .. ఎందుకంటే నా తప్పేం లేదు. ఇప్పుడు మేం ముగ్గురం బాగానే వున్నాం" అంటూ చెప్పుకొచ్చారు.  
brahmaji

More Telugu News