మరోసారి బయటపడిన ఆధార్ నిర్వాకం... ఒకే ఊరిలో 800ల మందికి ఒకే పుట్టిన తేదీ!
- ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో గైందీ ఖటా గ్రామంలో ఘటన
- సాంకేతిక తప్పిదం అంటున్న యూఐడీఏఐ
- విచారణ చేపడతామని హామీ ఇచ్చిన సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్
అందరి పుట్టినరోజులు ఒకేలా ఉన్నపుడు ఇక ఆధార్‌ని ప్రత్యేక సంఖ్య అనడంలో అర్థం ఏముందని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ తప్పిదానికి కారణాలేంటో తెలుసుకోవడానికి విచారణ చేపడతామని, అందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని హరిద్వార్ సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ మనీష్ కుమార్ హామీ ఇచ్చారు. ఈలోగా పుట్టిన తేదీ తెలిసిన వారు, ధ్రువీకరణ పత్రాలు తీసుకుని అందుబాటులో ఉన్న ఆధార్ కేంద్రాల ద్వారా అప్‌డేట్ చేసుకునే వీలుందని యూఐడీఏఐ తెలిపింది.